ముస్లిం సోదరులు ఈ నెల 12న బక్రీద్ పండుగ జరుపుకోనున్న నేపథ్యంలో ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టారు హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ అంజనీకుమార్. ప్రభుత్వ డిపార్ట్‌మెంట్లతో పాటు, ముస్లిం మతపెద్దలతో పోలీసులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వివాదాలకు దూరంగా పండగ జరుపుకుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే సమావేశంలో పాల్గోన్న ముస్లిం పెద్దలు పలు సూచనలు చేశారు. పండగ సంధర్భంగా ఆవులను బలి చేయద్దని ముస్లిం నాయకులు, మత పెద్దలకు సూచించారు. పండుగ ఆచారం ప్రకారం నాలుగు కాళ్ల జంతువును బలిదానం ఇవ్వాలని అయితే ఇతర మతాల వారి సెంటిమెంట్లను కూడ గౌరవించాలని వారు సూచించారు. ఈ నేపథ్యంలోనే పలు సూచనలు చేసి సామరస్యంగా ఎలాంటీ సంఘటనలు జరగకుండా పండగను జరుపుకుకోవాలని చెప్పారు.
కేంద్రంలో బీజేపీ అతిపెద్ద మెజారీటీ రావడంతో ఇలాంటీ వాటిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడ రాజధాని నుండి ప్రాతినిధ్యం వహించడంతో మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. ముఖ్యంగా రెండు వర్గాల మధ్య ఏ చిన్న సమస్య వచ్చినా అది దేశ వ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశాలున్నాయి. గతంలో కంటే బక్రీద్ పండగను అంత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య నిర్వహించనున్నారు.
వైసీపీకి ధైర్యముంటే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలి : కవిత