ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్ మరేదానికి లేదు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనడానికే ఇష్టపడతారు. కానీ మన దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కరోనా టైంలో బంగారం ధరలు ఆమాంతం పెరిగాయి. అయితే… బులియన్ మార్కెట్‌లో రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలు తాజాగా మళ్లీ పెరిగాయి. అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్‌లోనూ బంగారం ధరలు పెరిగి పోయాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 270 పెరిగి రూ. 48,870 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరిగి రూ. 44,800 వద్ద ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ పెరిగి పోయాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 280 పెరిగి రూ. 46,530 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరిగి రూ. 42,650 పలుకుతోంది. బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు అదే మార్గంలో భారీగా పెరిగాయి. కిలో వెండి ధర రూ. 1200 మేర పెరిగి రూ. 70,500 వద్ద కొనసాగుతోంది.
next post
ఆనాడు లోక్ సభలో అవిశ్వాస తీర్మానం.. ఈనాడు మోదీకి పాదాభివందనం!