telugu navyamedia
ఆంధ్ర వార్తలు

జ‌గ‌న్ కటౌట్ చూస్తే ప్రతిపక్షాలకు ఫీజులు ఎగిరిపోతాయి..ఈ కంటెట్ చూస్తే ప్రత్యర్థులకు ప్యాంట్లు తడిచిపోతాయి

గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన వైసీపీ ప్లీనరీ స‌మావేశాలు ఘనంగా సాగుతోంది. తొలిరోజు పార్టీకి సంబంధించి పలు తీర్మానాలను ఆమోదించారు. ఇందులో భాగంగా మాట్లాడిన మంత్రి రోజా ప్ర‌తిప‌క్షాల‌పై సినిమా పంచ్ డైలాగ్‌లు విసిరారు.

2019 ఎన్నికల్లో జగన్ ను సీఎం కానివ్వనన్నశాస‌నం చేసిన‌ పవన్‌ని శాస‌న‌స‌భ‌ గేటు కూడా తాకనివ్వలేదంటూ రోజా సైట‌ర్ వేశారు. పవన్ కల్యాణ్ రీల్ స్టార్ అయితే జగన్ రియల్ స్టార్ అంటూ రోజా వ్యాఖ్యానించారు

వెన్ను చూపకుండా పోరాడే దమ్మున్న నాయకుడు వైఎస్‌ జగన్‌.  వైసీపీ జెండాలో పోరాటం వుందని, పౌరుషం వుందని రోజా అన్నారువైసీపీ జెండా ఎప్పుడూ తలెత్తుకుని ఎగురుతూనే వుంటుందని.. ప్రజల గుండెల్లో గుడికట్టుకున్న నాయకుడు వైఎస్ అని ఆమె పేర్కొన్నారు

చంద్ర‌బాబు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ కలిసి కాదని… విడి విడిగా జగన్‌ను ఎదుర్కోవాలని రోజా సవాల్ విసిరారు.ఒకరికి 175 స్థానాల్లో అభ్యర్ధులు లేరని.. టీడీపీకి 60 స్థానాల్లో అభ్యర్ధులు లేరని స్వయంగా లోకేషే ఒప్పుకున్నారని రోజా గుర్తుచేశారు. టీడీపీలో ఆడాళ్లు తోడలు కొడతారని.. మగాళ్లు మాత్రం ఏడుస్తారంటూ ఆమె సెటైర్లు వేశారు. అదొక జంబలకిడి పంబ పార్టీ అంటూ మంత్రి అన్నారు.

వైసీపీ ప్లీనరీలో వైసీపీ కార్యకర్తలు తొడ గొడితే చంద్రబాబుకు హార్ట్ ఎటాక్ వస్తుందన్నారు. జగన్‌ని ఢీకొట్టడానికి గుంపులు గుంపులుగా కాదని.. సింగిల్‌గా రావాలని రోజా సవాల్ విసిరారు.

వైసీపీ సాధారణ రాజకీయ పార్టీ కాదని..దేశాన్ని గడగడలాడించిన సోనియాను గడగడలాడించిన పార్టీ అని.. వెన్నుపోటు దారుడు చంద్రబాబు వెన్నులో వణుకుపుట్టించిన పార్టీ అని రోజా అన్నారు.

వైఎస్ఆర్ లాంటి మహానేత మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి ఓ విజేతగా మనందరి ముందు జగన్ నిలబడ్డాడని రోజా అన్నారు. అలాగే దేశంలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైసీపీని నిలబెట్టారన్నారు. ఈరోజు జగన్ ను స్వర్గంలో ఉన్న వైఎస్ఆర్.. దేవుడికి తన బిడ్డను చూపించి గర్వంగా చెప్పుకుంటారని రోజా అన్నారు.

వైసీపీ జెండా జగనన్న ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనమని రోజా అన్నారు. కాన్ఫిడెన్స్ కు కటౌట్ వేస్తే జగన్ లా ఉంటుందని.., కమిట్ మెంట్ కు కలర్స్ వేస్తే ఇలాగే ఉంటుంది. ఈ కటౌట్ చూస్తే ప్రతిపక్షాలకు ఫీజులు ఎగిరిపోతాయి.. ఈ కంటెట్ చూస్తే ప్రత్యర్థులకు ప్యాంట్లు తడిచిపోతాయంటూ తనదైన శైలిలో పంచ్ లు వేశారు.

“ఆకలితో వేటాడే పులి చూసుంటారు.. ఆవేశంతో వేటాడే పులిని చూసుంటారు.. ఆదిపత్యం కోసం వేటాడేపులిని చూసుంటారు.. కానీ ఆశయం కోసం వేటాడే పులే ఈ పులివెందుల బిడ్డ జగన్ అని రోజా అన్నారు.

‘‘వెన్ను చూపకుండా పోరాడే దమ్మున్న నాయకుడు వైఎస్‌ జగన్‌. వైఎస్సార్‌సీపీ జెండా ఎప్పుడూ ఎగురుతూనే ఉంటుంది. ఆశయం కోసం పోరాడే పులి వైఎస్‌ జగన్‌’’ అంటూ మంత్రి రోజా కొనియాడారు.

Related posts