telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

లగడపాటి .. టీడీపీ తరపున ఏలూరు లోక్ సభ అభ్యర్థిగా..! ఇంకా..

Lagadapati Telangana Elections Results
గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో లగడపాటి రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల మళ్ళీ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్న ఆయన ఎక్కడ నుండి పోటీకి దిగనున్నారనే దానిపై చర్చ మొదలైంది. తాజాగా, ఆయన ఏలూరు నియోజక వర్గం నుండి, అదికూడా టీడీపీ పార్టీ తరుపున పోటీ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల చంద్రబాబు ను తన కుటుంబ వేడుకలకు ఆహ్వానించినందు వలన ఈ విధమైన వార్తలు వస్తున్నాయి అనుకోవచ్చు. దీనిపై టీడీపీ కూడా ఇంకా ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడం విశేషం. అయితే ఇప్పటికే ఏలూరు అభ్యర్థిగా టీడీపీ నుండి ఉన్న నేత మాగంటి బాబు. ఆయనను టీడీపీ పక్కన పెడితే.. పరిణామాలు కూడా టీడీపీ యోచిస్తున్నట్టు తెలుస్తుంది. 
ఇక అదే నియోజక వర్గం నుండి కావూరి కూడా వైసీపీ పార్టీ తరుపున బరిలో దిగనున్నట్టు వార్తలు వస్తున్నాయి. గతంలో లగడపాటి, కావూరి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైనా ఇప్పుడు వేరువేరు పార్టీల తరుపున బరిలో దిగటం సాధ్యమేనా.. అనే సందేహాలు వస్తున్నాయి. ఇప్పటికే కావూరి వైసీపీ లో చేరడం ఖాయం అన్న వార్తలు హాల్ చల్ చేస్తూనే ఉన్నాయి. 
వైసీపీ అధినేత జగన్ కోటగిరి శ్రీధర్ ను ఏలూరు నుండి బరిలోకి దింపుతారని అనుకుంటూ వస్తున్నారు. కానీ, పార్టీలోకి కావూరి వస్తే, శ్రీధర్ ను శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయించవచ్చునని అంటున్నారు. ఇక టీడీపీ నుండి కూడా రాజీవ్ పేరు అదే నియోజక వర్గం నుండి వినిపిస్తుంది. ఇది కావూరి పై వ్యూహంగా తెరపైకి తెచ్చినట్టు సమాచారం. తద్వారా కావూరి తప్పుకోవడం టీడీపీకి కలిసివచ్చే అవకాశం ఉంది. దీనితో పోటీ వైసీపీ నుండి శ్రీధర్ మరియు రాజీవ్ మధ్య ఉండనుంది. 
ఈ నెల 26వ తేదీన గానీ 29వ తేదీన గానీ కావూరి సాంబశివ రావు వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరవచ్చుననే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఆయన వైసిపిలో చేరుతురంటూ ప్రచారం సాగుతోంది. కావూరి మాత్రం ఆ విషయంపై ఇప్పటివరకు ఏమీ మాట్లాడ లేదు. పై తేదీలలో ఏదోఒక స్పష్టత రానుంది.

Related posts