telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మంత్రి విశ్వరూప్‎ ఇంటిని త‌గ‌ల‌బెట్టిన నిర‌స‌న‌కారులు..

*మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు

*అమ‌లాపురంలో ఉన్న మంత్రి విశ్వ‌రూప్‌..ముంద‌స్తు స‌మాచారంతో ఇల్లు విడిచి వెళ్ళిపోయిన మంత్రి విశ్వరూప్

*3 ఆర్టీసీ బ‌స్సులు ..2 ప్ర‌వేట్ బ‌స్సులు ధ్వంసం..

* గాల్లో కాల్పులు జ‌రుపుతున్న పోలీసులు..

అమలాపురం రణరంగంగా మారింది. ఆందోళ‌న‌కారుల‌తో ఆ ప్రాంతమంతా అట్టుడికిపోతోంది. ఇటీవ‌ల కోనసీమ జిల్లాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమగా పేరు మార్పు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది

దీంతో జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లాను కొనసాగించాలని ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.

144 సెక్షన్‌ విధించిన నేపథ్యంలో నిరసనకారులను పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. అయితే ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి వాహనం రాళ్లదాడి చేశారు. ఈ దాడుల్లో కొంతమంది పోలీసులు గాయపడ్డారు. నిరసనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. 3 ఆర్టీసీ బ‌స్సులు, 2 ప్రైవేట్‌ కాలేజ్‌ బస్సులు దగ్ధం చేశారు.

త‌రువాత మంత్రి విశ్వరూప్‌ ఇంటిని నిప్పు పెట్టారు. త‌రువాత మంత్రి ఇంటి ఆవ‌ర‌ణ‌లో ఉన్న 3 కార్లను సైతం తగులబెట్టారు. దీంతో మంత్రి ఇంటిని వదిలి వెళ్లిపోయారు.  

నిర‌స‌న‌కారులు అటాక్ స‌మ‌యంలో ఇంట్లో ఉన్న కుటుంబ‌స‌భ్యుల‌ను జాగ్ర‌త్త‌గా అక్క‌డి నుంచి త‌ర‌లించారు. మంత్రి విశ్వరూప్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు

దీనిపై మంత్రి విశ్వరూప్‌ స్పందిస్తూ..  తన ఇంటిని తగలబెట్టడం దురదృష్టకరమన్నారు. అంబేద్కర్ పేరు పెట్టినందుకు ప్రజలు గర్వపడాలన్నారు. విపక్షాలు డిమాండ్ చేస్తేనే అంబేద్కర్ పేరు పెట్టామని మంత్రి విశ్వరూప్ వెల్లడించారు. 

అయితే ఇప్పుడు యువతను కావాలనే రెచ్చగొడుతున్నారని, చేతులు జోడించి వేడుకుంటున్నారని, ప్రజలు శాంతించాలని కోరారు.

రాజకీయ ప్రయోజనాల కోసమే విపక్షాలు చేస్తున్న కుట్రలివి. జిల్లాకు అంబేడ్కర్‌ పేరును వ్యతిరేకించడం సరికాదు. ఆయన పేరు పెట్టడంపై అందరూ గర్వపడాలి. ప్రస్తుత సమయంలో అందరూ సంయమనం పాటించాలి’ అని మంత్రి విశ్వరూప్‌ కోరారు.

Related posts