telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఎప్పుడు లేని విధంగా పాస్టర్లకు వేతనాలు పెంచారు : డిప్యూటీ సీఎం

అర్చకులు, పాస్టర్లు, ఇమామ్, మౌజన్ లను ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం హర్షించదగ్గ విషయం అన్నారు డిప్యూటీ సీఎం అంజాద్ బాష. సమాజంలో అర్చకులు,పాస్టర్లు, మౌజన్లు,ఇమామ్ లకు గౌరవ స్థానం ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యం. గతంలో వీరికి ఇచ్చే గౌరవ వేతనాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెంచి వారి ముఖాల్లో ఆనందం చూస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా పాస్టర్లకు కూడా వేతనాలు పెంచారు. పాదయాత్ర లో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెరవేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు వీరి సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదు. కరోనా కష్ట కాలంలో కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్. దేశంలో ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలో పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం. కరోనా మహమ్మరిని నిరోధించడానికి మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేష్. ఈ విషయంలో ఇతర రాష్ట్రాలు మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. కరోనా వ్యాధి నివారణకు ప్రజలు సహకరించాలి అని అన్నారు.

Related posts