మారో తుఫాన్ విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ‘మహా’ తుఫాన్ రానున్న 24 గంటల్లో అతి తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉందని తెలిపింది. దీంతో 24 గంటల్లో మహారాష్ట్ర, గోవాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ప్రస్తుతం ఇది లక్షద్వీప్‌కు వాయవ్యంగా 450 కి.మీ, మంగళూరుకు వాయవ్యంగా 460 కి.మీ,, గోవా దక్షిణ నైరుతికి 310 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. 2019లో ఏర్పడిన 4వ తుఫాన్.. ‘మహా’ వాయవ్య దిశగా కదలొచ్చని ఐఎండీ అంచనా వేసింది. దీని ప్రభావంతో కేరళ, కర్ణాటక తీర ప్రాంతం, దక్షిణ తమిళనాడుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.
కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లలో మోస్తరు వర్షాలు కురుస్తాయని స్కైమెట్ అంచనా వేసింది. మరోవైపు తూర్పు మధ్య అరేబియా సముద్రంలో గంటకు 100-125 కి.మీ వేగంతో పెనుగాలులు వీస్తున్నాయని, ఇవి మరింత తీవ్రరూపం దాల్చవచ్చని చెప్పింది. మరో 12 గంటలు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. కర్ణాటక-గోవా-మహారాష్ట్ర మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. లక్షద్వీప్‌కు ‘మహా’ ముప్పు తప్పడంతో అక్కడి ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. మహా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ, రేపు వర్షాలు కురుస్తాయన్నారు. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది.
సగం గోచీ నువ్వే విప్పుకున్నావ్… నరేష్ పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు