telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రామ్, పూరిజగన్నాధ్ ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్ర షూటింగ్ ప్రారంభం..!!

ismart sankar shooting started
ఎనర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలయికలో వస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రం షూటింగ్ నేడు ప్రారంభమయ్యింది..’డబుల్ ధమాకా దిమాక్’ అనే క్యాప్షన్ తో సినిమా వస్తుండగా సరికొత్త హెయిర్ స్టైల్, గడ్డంతో రామ్ ఈ సినిమా లో కనిపించనున్నారు. కాస్ట్యూమ్స్ కూడా రామ్ పాత్ర కు తగినవిధంగా వైవిధ్యంగా ఉండడం విశేషం.. ఈ లాంగ్ షెడ్యూల్ లో హీరో రామ్ పై పలు ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కి మణిశర్మ సంగీతం అందిస్తుండగా  రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా లో పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి మరియు గెటప్ శ్రీను ఇతర పాత్రల్లో నటిస్తున్నారు..పూరీ జగన్నాధ్ టూరింగ్ టాకీస్ , పూరీ కనెక్ట్స్ పతాకాలపై పూరీ జగన్నాధ్ , ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ని మే లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..
నటీనటులు : రామ్ పోతినేని, పునీత్ ఇస్సార్, సత్య దేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాన్షు పాండే, మధు సింగంపల్లి, కుల్దీప్ సింగ్, దీపక్ శెట్టి.. 
సాంకేతిక నిపుణులు : 
దర్శకుడు: పూరి జగన్నాధ్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, చార్మీ కౌర్
సమర్పణ: లావణ్య
బ్యానర్లు: పూరి జగన్నాధ్ టూరింగ్ టాకింగ్స్, పూరి కనెక్ట్స్
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
ఆర్ట్ డైరెక్టర్ : జానీ షైక్
ఎడిటర్ : జునైద్ సిద్ధిఖి 
పాటల రచయిత: భాస్కరభట్ల
ఫైట్స్ : రియల్ సతీష్

Related posts