telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రాజస్థాన్ లో “పానిపట్” సినిమాలను నిలిపివేయాలంటూ డిమాండ్… థియేటర్ పై దాడి

Panipat

బాలీవుడ్ నుంచి మరో హిస్టారికల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే “పానిపట్”. 1761 జనవరి 14న అఫ్గానిస్థాన్ రాజు అహ్మద్ షా అబ్దాలీకి, మరాఠా సామ్రాజ్యానికి మధ్య జరిగిన మూడో యుద్ధమే పానిపట్. ఈ కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించారు అషుతోష్ గోవారికర్. అర్జున్ కపూర్, సంజయ్‌దత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే “పానిపట్” సినిమాపై జాట్ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో జాట్ చక్రవర్తిగా పేరొందిన మహారాజా సూరజ్‌మాల్ పాత్రను తప్పుగా చూపించారంటూ ఆ వర్గానికి చెందిన కొంతమంది ఆరోపిస్తున్నారు. పానిపట్ సినిమా జాట్ వర్గీయుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని సినిమా ప్రదర్శనను నిలిపేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులు సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ జైపూర్‌లోని ఓ థియేటర్‌పై దాడి చేశారు. థియేటర్‌లోని అద్దాలు, ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ సీఎం అశోక్‌గెహ్లాట్ మాట్లాడుతూ..కళలు, సంస్కృతి సాంప్రదాయాలను ప్రతీ ఒక్కరూ గౌరవించాల్సిన అవసరముందన్నారు. ఎవరి మనోభావాలు దెబ్బతీయకూడదన్నారు. డిస్ట్ట్రిబ్యూటర్లు ఆందోళనకారులతో చర్చలు జరుపాల్సిన అవసరముందని, అలా అయితే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Related posts