telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మూడు నెలల విద్యుత్ బిల్లులు రద్దు చేయాలి: చంద్రబాబు డిమాండ్

chandrababu

ఏపీ సర్కార్ కరెంటు చార్జీల పెంపునకు నిరసనగా టీడీపీ నాయకులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న నిరసనలకు ప్రజలు మద్దతు తెలపాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు కోరారు. ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచడం పట్ల మరోసారి మండిపడ్డారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ రోజు నిరసనలకు దిగుతున్నట్లు గుర్తు చేశారు.

‘అసలే లాక్ డౌన్ వల్ల పనుల్లేక పేదలు, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా కష్టాలు పడుతుంటే… ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా కరెంటు శ్లాబులు మార్చి, చార్జీలు పెంచి వాళ్ల మీద బిల్లుల భారం మోపడం అన్యాయం. విద్యుత్ చార్జీలు పెంచేది లేదని చెప్పి అధికారంలోకి వచ్చాక ఇలా చేయడం మోసం’ అని ఆయన ట్వీట్ చేశారు.లాక్ డౌన్ నేపథ్యంలో 3 నెలల విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Related posts