సార్వత్రిక ఎన్నికల అనంతరం ఏపీలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని కొండేపల్లిలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణుల దాడికి పాల్పడ్డారు. స్వగ్రామంలో ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి కార్యకర్తలకు విందు ఏర్పాటు చేశారు. ఆ విందుకు వెళ్లిన తల్లి, కుమారుడిపై వైసీపీ కార్యకర్తల దాడికి తెగబడ్డారు. దాడిలో తల్లి సువార్తమ్మ, కుమారుడు సురేష్‌కు గాయాలయ్యాయి. వెంటనే వారిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.