telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కమల్‌ ‌పై ప్రత్యర్థి కేసు.. ఎందుకంటే..?

Kamal-Haasan

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది తమిళనాడులో నాయకుల మధ్య విమర్శల దాడి పెరుగుతుంది. అయితే ఈసారి ఎన్నికల్లో సినీనటుడు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం కూడా పోటీ చేస్తున్నది.  దక్షిణ కోయంబత్తూరు నియోజక వర్గం నుంచి కమల్ హాసన్ పోటీ చేస్తున్నాడు. ఇక తాజాగా కోయంబత్తూరు దక్షిణం స్థానం నుంచి పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి పళనికుమార్‌ కాట్టూరు పోలీస్‌ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు  కమల్‌ హాసన్‌పై కేసు నమోదైంది. కమల్‌ చేసిన ఎన్నికల ప్రచారంలో భాగంగా రాంనగర్‌, కాట్టూరు తదితర ప్రాంతాల్లో ఓపెన్‌ టాప్‌ జీపులో ప్రచారం చేస్తున్నప్పుడు రాముడు, సీత వేషధారణలో ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నారు. అప్పుడు రాముడు వేషధారణలో ఉన్న వ్యక్తిని చూసి.. ఈ రాముడు.. ఆ రాముడు.. మన దేవుడే అని, కానీ కొందరు రాజకీయాల కోసం వాడుకుంటున్నారని కమల్‌ వ్యాఖ్యానించారని పళనికుమార్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కమల్‌ హాసన్‌తో పాటు మక్కల్‌ నీది మయ్యం పార్టీకి చెందిన మరో ఇద్దరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే మొదట చెన్నై లోని మైలాపూర్ నుంచి పోటీ చేయాలని అనుకున్నా, దక్షిణ కోయంబత్తూరులో పార్టీకి మంచి పట్టు ఉండటంతో అక్కడి నుంచి పోటీ చేయడం సేఫ్ అనుకోని అక్కడి నుంచి బరిలో దిగారు కమల్.  

Related posts