telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

హోదా కోసమే .. తెరాస తో పొత్తు .. : వైసీపీ జగన్

Ycp Jagan comments chandrababu Pawan

నేడు వైసీపీ జగన్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొని ప్రసంగించారు. ఆయన కెసిఆర్ తో పొత్తు పై వివరణ ఇస్తూ తాను ప్రత్యేక హోదా కోసమే ఆయనతో కలిశాను అన్నారు. ఈ విషయం పై అధికార పక్ష పార్టీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ చంద్రబాబు పై మండిపడ్డారు. ఏపీలో 25 ఎంపీ స్థానాల్లో తమ పార్టీని గెలిపిస్తే, దానికి తెలంగాణ నుంచి 17 ఎంపీలు తోడైతే కేంద్రంలో హోదాను అడ్డుకోవడం ఎవరి తరం కాదని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు.

జగన్ మాట్లాడుతూ, ప్రత్యేక హోదా విషయం పై కెసిఆర్ తో చర్చలు జరిపామని వారు సానుకూలంగా స్పందించడంతో ఆయనతో పొత్తుకు సిద్ధం అయ్యాం అన్నారు. ప్రత్యేక హోదా తీసుకురావడం తన ఒక్కడి వల్ల సాధ్యం కాదని, ఇంకా ఎక్కువ మంది ఎంపీల మద్దతు కూడా అవసరమని జగన్ చెప్పారు. జగన్ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి రాగానే 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. పరిశ్రమల్లో స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాలిచ్చే విధంగా చట్టం తీసుకొస్తామని అన్నారు. ప్రతి గ్రామానికి ఓ సచివాలయం ఏర్పాటు చేసి, వాటిలో స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తాం. ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్‌ను విడుదల చేస్తామని జగన్ వెల్లడించారు. బాబు వస్తే జాబు వస్తుందని అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు లాకున్నరంటూ బాబు పై ధ్వజమెత్తారు జగన్.

Related posts