తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన అసెంబ్లీ, సచివాలయం నూతన నిర్మాణాల పై చెన్నూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందించారు. కొత్త అసెంబ్లీ, సచివాలయం ఎందుకని విపక్ష నేతలు అనడం సరికాదన్నారు. ఇప్పుడున్న అసెంబ్లీలో స్థలం సరిపోవడం లేదన్నారు. అలాగే సచివాలయంలో వసతులు సరిగా లేవని, అందుకే కొత్తవి కడుతున్నామని తెలిపారు.
సీఎం కేసీఆర్ చేపడుతున్న ఈ పనులన్నీ భవిష్యత్తు తరాల కోసమేనన్నారు. చౌరస్తాలో నిలబడి ఏ పార్టీకి వెళ్లాలో తెలియని వాళ్లే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారని దుయ్యబట్టారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై టీఆర్ఎస్ తప్ప ఏ పార్టీ స్పందించలేదని అన్నారు. కాంగ్రెస్ నేతలు బడ్జెట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని చెప్పారు.