telugu navyamedia
తెలంగాణ వార్తలు

దివ్యాంగుల‌ ఆత్మగౌరవానికి పెద్దపీట

దివ్యాంగులకు ప్రత్యేక గౌరవాన్ని కల్పించడంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ బౌద్ధ నగర్ లో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు… వికలాంగులని పిలిచి అవమానించవద్దని, వారికి మానసిక ధైర్యం కల్పించాల్సిన అవసరం ఉందని నరేంద్ర మోడీ వివరించారు. రాజ్యాంగంలో వికలాంగులనే పదాన్ని తొలగించి దివ్యాంగులు అనే పదాన్ని చేర్చారని ప్రస్తావించారు..

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఖాళీగా ఉన్న 4శాతం ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసి వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ కార్యాలయాలలోనే కాకుండా విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, సినిమా హాల్స్, ఎక్కడైనా సరే దివ్యాంగుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కేంద్రం చట్టం చేసిందని వెల్లడించారు.. దివ్యాంగులతో పాటు వృద్దులకు కావలసిన ఉపకరణాలను అందించడానికి సిద్ధంగా ఉన్నామని, ఉపకరణాలు అవసరమున్న వారంతా తమతమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.

Related posts