telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మమతా బెనర్జీకి దిమ్మతిరిగే షాక్ : నందిగ్రామ్ లో వెనుకంజ

వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల ఫలితాల విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల సంఘం. కరోనా నిబంధనలు కారణంగా నెగటివ్ రిపోర్ట్ ఉన్న వారికీ మాత్రమే కౌంటింగ్ సెంటర్ కి అనుమతి ఇస్తున్నారు. కాసేపటి క్రితమే కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. మొత్తం 292 అసెంబ్లీ స్థానాలకు జరుగుతోంది కౌంటింగ్. తృణమూల్ కాంగ్రెస్- బిజేపి మధ్య హోరా హోరీగా ఎన్నిక జరుగగా, ఫలితాలు కూడా అలాగే వస్తున్నాయి. ఇప్పటి వరకు 102 స్థానాలకు అధిక్యాలు రాగా.. టీఎంసీ 52 చోట్ల, బిజేపి 42 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. అయితే మమతా ఎంతో ప్రతిష్టత్మకంగా తీసుకున్న నందిగ్రామ్ లో.. ఆమె ప్రత్యర్థి సువేందు ఆధిక్యంలోకి వచ్చారు. మొదట్లో మమతా ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. ఇప్పుడు సువేందు ఆధిక్యంలోకి రావడం విశేషం. అయితే తుది ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే.

Related posts