telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

బాలు నెల్లూరులో పుట్టడం తెలుగు ప్రజల అదృష్టం: మంత్రి అనిల్

minister anil kumar

నిన్న మృతి చెందిన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అంత్యక్రియలకు ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి అనిల్ కుమార్ జాదవ్ హాజరయ్యారు. తమిళనాడు లోని తిరువళ్లూరు జిల్లాకు వెళ్లిన అనిల్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

బాలు నెల్లూరులో పుట్టడం తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు. ఆయనకు గుర్తుగా నెల్లూరులో ఓ స్మారకాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని తెలిపారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి, అతి త్వరలోనే అధికారిక నిర్ణయాన్ని ప్రకటిస్తామని మంత్రి అనిల్ స్పష్టం చేశారు.

“ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతిక కాయానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తరపున నివాళులర్పించిన మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్. నెల్లూరులో గానగంధర్వుడికి తగిన స్థాయిలో జ్ఞాపకం ఏర్పాటు చేసేందుకు సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం- మంత్రి అనిల్” అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఓ ట్వీట్ చేసింది.

Related posts