telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఆందోళ‌న‌లపై స్పందించిన సజ్జల..

కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న దాడిపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…జిల్లాల విభజన సందర్భంగా ఆ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టాలని వినతులు వచ్చాయి. విస్తృతంగా డిమాండ్ ఉండటంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నామ‌ని తెలిపారు.

ప్రస్తుత పరిస్థితులు వెనుక ఏ శక్తులు ఉన్నాయో కానీ గతంలో అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి.  ప్రజలు సంయమనం పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేశారు. అంబేడ్కర్ ఒక జాతీయ మహా నేత, భరత మాత ముద్దుబిడ్డ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

రెచ్చగొట్టడం ఎవరూ చేసినా తప్పే.. మా పార్టీకి వచ్చే ప్రయోజనం ఇందులో ఏమీ లేదు. రాజకీయ ప్రయోజనాల కోసం చేసింది అయితే కాదు. ఒక మహానేత పేరు పెడితే పునరాలోచించాలిల్సిన అవసరం ఏముంది. అంతటి నాయకుడు పేరును పెట్టడం అందరూ ఓన్ చేసుకోవాలి అన్నారు. ఆ పేరు పెట్టడంపై అన్ని వర్గాల ఆమోదం ఉంది కాబట్టి పరిష్కరించలేని సమస్య అయితే కాదని’ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Related posts