ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని సీఎం జగన్.. మంగళవారం ప్రారంభించారు. సంపన్న వర్గాల్లో వెనుకబడిన పేద మహిళల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేశారు.
ఇప్పటికే జగనన్న అమ్మఒడి , వైఎస్సార్ పెన్షన్ కానుక, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం ఉచిత ఇళ్ళ పట్టాల వంటి పథకాలను మహిళల పేరుతో అందించిన ప్రభుత్వం మరో పథకాన్ని.. మహిళల పేరుతో ప్రారంభించింది
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. అగ్రవర్ణ పేద మహిళ మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా సీఎం జగన్ ఈ పథకాన్ని తీసుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా 45-60 ఏళ్ల మధ్య వయసున్న 3,92,674 మంది మహిళల ఖాతాల్లో రూ.589 కోట్ల ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి సీఎం జమ చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరిస్తూ పాలన చేస్తున్నామని అన్నారు. ఈబీసీ నేస్తం పథకం ద్వారా రెడ్డి, కమ్మ, ఆర్య వైశ్య, బ్రహ్మాణలు, క్షత్రియ, వెలమతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న పేద మహిళలకు ఆర్థిక సాయం చేస్తున్నామని చెప్పారు.
మ్యానిఫెస్టోలో పెట్టలేదు.. ఏ ఎన్నికల్లో హామీ ఇవ్వలేదని.. అయినా మహిళ కష్టాలను అర్థం చేసుకున్న ఒక అన్నగా తాను ఈ పతకానికి శ్రీకారం చుట్టాను అన్నారు సీఎం జగన్. అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారని చెప్పారు. అగవర్ణ పేద మహిళలకు మెరుగైన జీవనోపాధే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వం వల్ల మూడు నెలల్లోనే రాష్ట్రం దివాళా: ఎంపీ రామ్మోహన్ నాయుడు