telugu navyamedia
ఆంధ్ర వార్తలు

విశాఖ ఉక్కు కార్మికుల వినూత్న నిరసన..

సాగు చట్టాలను రద్దు చేసినట్లే స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని నేతలు డిమాండ్‌ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటికరణ వ్యతిరేకిస్తూ కార్మికులు వంటా- వార్పుతో నిరసన తెలిపారు. కేంద్రప్రభుత్వం నిర్ణయం కార్మికుల కుటుంబాలను వీధిపాల్జేస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం పునరాలోచించి విశాఖ ఉక్కు కర్మాగారంపై సముచిత ఆలోచన చేయాలని కార్మిక సంఘ ప్రతినిధులు సూచించారు. వంటా, వార్పు వినూత్న నిరసనలో కార్మికులు, మహిళలు పాలుపంచుకున్నారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునేవరకు తమ పోరాటం ఆగదని ఉక్కు పరిరక్షణ సమితి పునరుద్ఘాటించింది. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమంతో నిరసన ప్రదర్శన చేశారు. ఉక్కునగరం, కూర్మన్నపాలెం కూడలి, పెదగంట్యాడ, తెలుగుతల్లి విగ్రహం తదితర ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనల్లో పెద్ద సంఖ్యలో కార్మికులు, నిర్వాసితులు పాల్గొన్నారు.

Related posts