ఆంధ్రప్రదేశ్ నూతన ఇంటెలిజెన్స్ చీఫ్‌గా కుమార్ విశ్వజిత్ ను నియమించారు. రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన ముగ్గురు అధికారుల పేర్ల నుంచి సీఈసీ ఆయన పేరును ఖరారు చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.1994 బ్యాచ్‌కు చెందిన విశ్వజిత్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్‌గా ఉన్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సహకరిస్తున్నారంటూ ఏపీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు సహా మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై వైసీపీ ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు అందజేసింది. ఈ వ్యవహారంపై ఆరా తీసిన అధికారులు.. ఐబీ చీఫ్ వెంకటేశ్వరరావుతో పాటూ మరో ఇద్దరు ఎస్పీలను బదిలీ చేసిన సంగతి తెలిసిందే.
previous post