telugu navyamedia
సినిమా వార్తలు

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ‘శేఖర్’ గ్లింప్స్‌ విడుదల..

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘శేఖర్’. హీరోగా ఆయన 91వ చిత్రమిది. ఇందులో రాజశేఖర్.. శేఖర్​ అనే రిటైర్డ్ పోలీస్​ అధికారిగా కనిపించనున్నారు. అను సితార, మస్కన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మలయాళ సినిమా ‘జోసెఫ్’కు ఇది రీమేక్​!

ఈ చిత్రానికి రాజశేఖర్​ సతీమణి జీవితా రాజశేఖర్​ దర్శకత్వం వహించారు. స్క్రీన్ ప్లే కూడా ఆమె సమకూర్చారు. బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గురువారం ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ విడుదల చేశారు.

Angry Star Rajashekar's 91st movie Shekar' gets a superb glimpse

అరకు బోసు గూడెం తోట బంగ్లాలో నూతన దంపతులు దారుణ హత్యకు గురయ్యారని ఓ మహిళ చెప్పే వాయిస్ ఓవ‌ర్‌తో ఫ‌స్ట్ గ్లింప్స్‌ మొదలైంది. ఘటనా స్థలానికి పోలీసులు వెంటనే చేరుకున్నా… ఇన్వెస్టిగేషన్ చేయరు. కొన్ని రోజుల క్రితం రిజైన్ చేసిన శేఖర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. 

ఆ తర్వాత ‘శేఖర్’గా రాజశేఖర్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. ‘వాడు ఎప్పుడైనా మనం చెప్పింది చేశాడా? వాడు చేసేది మనకు చెప్పాడా?’ అని బ్యాక్‌గ్రౌండ్‌లో డైలాగులు వినిపిస్తూ ఉంటే… స్ట‌యిలిష్‌గా సిగ‌రెట్ వెలిగిస్తూ రాజశేఖర్ స్క్రీన్ మీద కనిపించారు. సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో రాజశేఖర్ ఆహార్యం ఆయన గత సినిమాలకు భిన్నంగా ఉంది.   ప్రస్తుతం షూటింగ్​ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Related posts