telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సింహాచలం భూముల అక్రమాలపై దూకుడు పెంచిన ప్ర‌భుత్వం..

మాన్సాన్‌ అయిన సింహాచలం భూములపై ప్రభుత్వం దూకుడు పెంచింది. బాధ్యులైన సూత్రధారులు, పాత్రధారుల లెక్కలు బయటపెట్టేం దుకు విజిలెన్స్ విచారణ వేగవంతం అయ్యింది. 2016-2017లో దేవస్థానం ఆస్తుల జాబితా నుంచి 862 ఎకరాలు తొలగించినట్లు దేవాదాయశాఖ త్రిసభ్య కమిటీ గుర్తించి నివేదిక ఇచ్చింది.

ఈ రిపోర్ట్ ఆధారంగా ప్రాప ర్టీ రిజిస్టర్ నుంచి నిబంధనలకు విరుద్ధంగా తొలగించిన భూముల విలువ బహిరంగ మార్కెట్లో 10వేల కోట్ల రూపాయలనేది ఓ వాదన. దీంతో దేవుడి సొమ్మును కొల్లగొట్టిన వా రిని ఆధారాలతో సహా పట్టించాలనే పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగానే 862ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చింది. దీంతో క్రయ విక్రయాలు జరిపే వీలు లేదు. ఇప్పటికే ఈ భూములు చేతులు మారిపోగా…చాలా అపార్ట్ మెంట్లు, భవనాలు, లే అవుట్లు పుట్టుకొచ్చాయి.

బీఆర్టీఎస్‌కు ఆను కుని సింహాచలం, వేపగుంట ప్రాంతాల్లో కొత్తకొత్త అపార్ట్ మెంట్లు నిర్మాణం కాగా… వీటిలో చాలా భాగం దేవస్థానం భూముల వివాదంలో ఉన్నాయి. ఇక్కడ అమ్మకాలు, కొనుగోళ్లు చేసేప్పుడు జాగ్రత్త లు పాటించకపోతే ఇబ్బందులు తప్పవంటున్నారు అధికారులు. సింహచలం దేవస్థానానికి చెందిన భూములు ప్రాపర్టీ రిజిస్టర్ నుంచి తొలగించారనేది నిర్ధారణ అయింది. అయితే వీటిని ఎందుకు, ఎవరికి కేటాయించారనేది లెక్క తేలాల్సి ఉంది.

మాన్సాస్‌ భూముల అమ్మకాల్లో రూ. 74 కోట్లు నష్టం వాటిలిందని. సింహాచలం ఆలయ ప్రాపర్టీ రిజిస్ట్రార్‌లో 860 ఎకరాల భూములు గల్లంతైనట్లు అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారంలో అధికార పరిధిని దాటినందుకు ఇప్పటికే మాజీ అడిషనల్‌ కమిషనర్‌ రామచంద్ర మోహన్‌, డిప్యూటీ ఇవో సూజాతను సస్పెండ్ చేసింది. దీంతో మాన్సస్ ట్రస్ట్ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు బాధ్యతలు స్వీకరించారు.

Related posts