telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

విశాఖ రాజధాని.. భవనాల వెతుకులాట మొదలు.. అందులో రహస్యం ఎందుకు…

visakha will be 2nd capital to AP

విశాఖ ను రాజధానిగా ప్రకటించడంతో అక్కడ పరిపాలనా భవనాలు ఎక్కడెక్కడున్నాయి? వాటిలో ఎంత విస్తీర్ణం అందుబాటులో ఉందన్న విషయాలను అధికారులు ఆరా తీస్తున్నారు. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని రావచ్చన్న ప్రకటనల నేపథ్యంలో అప్రమత్తమయ్యారు. భవనాల నిర్మాణాలకు ఏయే ప్రాంతాలు అనుకూలమన్న అంశంపై జిల్లా అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. విప్రో సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నగరం నడిబొడ్డున ఏడు ఎకరాలను కేటాయించింది. ఆ భూముల్లోని కొంతభాగంలో ఒక భవనాన్ని నిర్మించిన విప్రో సంస్థ మిగిలిన భూభాగాన్ని ఖాళీగా ఉంచింది.

జేసీ వేణుగోపాలరెడ్డి విప్రో కార్యాలయాన్ని సందర్శించారు. కొందరు అధికారులు, ఉద్యోగులు ఆ స్థలం వివరాలు తెలుసుకున్నారు. దీనిపై వేణుగోపాలరెడ్డిని సంప్రదించగా తాను విప్రో కార్యాలయానికి వెళ్లడం వాస్తవమే గానీ, రాజధానికి సంబంధించిన భవనాల పరిశీలన కోసం కాదన్నారు. హైదరాబాద్‌లోని విప్రో భవనాన్ని చూసిన నేపథ్యంలో విశాఖ విప్రో భవనం ఎలా ఉంటుందో చూసేందుకు వెళ్లానన్నారు. జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ మాట్లాడుతూ, రాజధాని ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు అందలేదని, తాము ఎలాంటి ప్రక్రియలు ప్రారంభించలేదని పేర్కొన్నారు.

Related posts