telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పదో తరగతి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

పదో తరగతి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అన్ని సబ్జెక్టులకు పరీక్ష రాసే సమయాన్ని పెంచుతూ సవరణ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. మొదటి, ద్వితీయ, తృతీయ భాష ప్రశ్న పత్రాలు, గణింతం, సామాజిక శాస్త్రం సబ్జెక్టులకు 3 గంటల 15 నిముషాల సమయాన్ని కేటాయింపు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఐదు సబ్జెక్టులను 100 మార్కులకు ప్రశ్నా పత్రాలు ఉండనున్నట్లు నిర్ణయం తీసుకుంది. భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం ప్రశ్నా పత్రాలకు 2 గంటల 15 నిముషాల సమయాన్ని పెంచిన విద్యా శాఖ… రెండు పత్రాలకు 50 మార్కుల చొప్పున ప్రశ్నలు ఇవ్వనుంది. కంపోజిట్ కోర్సులోని రెండో భాష పేపర్-2కు 1.45 నిముషాల సమయం ఉండనుండగా…. ఒకేషనల్ కోర్సు పరీక్షకు రెండు గంటల సమయం ఇస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మార్పులు చేసిన ఈ సమయాలను వర్తింప చేయాల్సిందిగా పరీక్షల డైరెక్టర్ ను ఆదేశించింది ఏపీ ప్రభుత్వం.

Related posts