telugu navyamedia
రాశి ఫలాలు

సెప్టెంబర్ 3(శుక్రవారం) రాశి ఫలాలు

మేషం: ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది.ఖర్చుల విషయంలో జాగ్రత్త. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. వృతి, వ్యాపార ఉద్యోగాల్లో చక్కని అభివృద్ధి ఉంటుంది.

వృషభం: తలపెట్టిన పనులు చాలావరుకు పూర్తి చేస్తారు. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువులు, స్నేహితులు పలకరిస్తారు. ఉద్యోగులకు బాగుంటుంది. ఆరోగ్యం జాగ్రత్త.

మిథునం: ఆర్థికంగా బాగుంటుంది. అప్పు తీసుకోవడానికి, ఇవ్వడానికి ఇది సమయం కాదు. ఎవరితోనూ వాదనలకు దిగొద్దు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది.

కర్కాటకం: ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. పలుకుబడిగలవారితో పరియాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీల వల్ల ఇబ్బంది పడతారు.

సింహం: చేపట్టిన పనులు నెరవేరుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆర్థిక లావాదేవీలకు వీలైనంత దూరంగా ఉండండి.

కన్య: వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి తీపి కబురు వింటారు. ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.

తుల: వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగం విషయంలో ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

వృశ్చిక: అనుకోని విధంగా డబ్బు చేతికి వస్తుంది. ఉద్యోగులకు బాగుంటుంది. స్థలం కొనే ఆలోచన చేస్తారు. వ్యాపారంలోని వారు మరింతగా శ్రమపడాల్సి ఉంటుంది. బంధువులకు సంబంధించిన ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.

ధనస్సు: ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త. చేపట్టిన పనులు చాలావరకు పూర్తవుతాయి. అవసరాలకు తగినంత డబ్బు అందుతుంది. బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి.

మకరం: వివాహ ప్రయత్నాలకు అనుకూలం. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వ్యాపారులకు బాగుంటుంది. కొత్త మిత్రులు పరిచయమవుతారు. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి.

కుంభం: ఆదాయం బాగుంటుంది. ఖర్చులు తగ్గించుకొండి. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. వ్యాపారులకు ఆర్థికంగా చాలా బాగుంది. ఆరోగ్యం జాగ్రత్త. వివాదాలకు కాస్తంత దూరంగా ఉండండి.

మీనం: ఉద్యోగులకు బాగుంటుంది. అప్పులు తీరుస్తారు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలకు ఇది మంచి సమయం. ఎవరికీ హామీలు ఉండొద్దు. రాజకీయాల్లో వారికి అప్రమత్తత అవసరం.

Related posts