telugu navyamedia
ఆరోగ్యం

పంటి నొప్పిని నివారించే చిట్కాలు

సహజంగా పుప్పిళ్లు, దంతాలలో పగుళ్లు, చిగుర్లు ఉబ్బడం వల్ల పంటినొప్పి సమస్య వస్తుంది. అయితే పుప్పిళ్లు వంటి పెద్ద సమస్యలు వస్తే వైద్యులను సంప్రదించాల్సిందే. అలా కాకుండా చాలా మందికి అప్పుడప్పుడు అకస్మాత్తుగా పంటి నొప్పి వస్తుంది. ఈ నొప్పిని సురక్షితమైన సహజ పధ్ధతులలో నివారించడం గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం. మన వంటింట్లో ఉండే దినుస్సులు మిరియాలు, వెల్లుల్లి వంటివి పంటి నొప్పిని సమర్ధవంతంగా నివారిస్తాయి.

పంటి నొప్పిని తగ్గించే చిట్కాలు :

*లవంగ నూనెలో ఒక చిటికెడు మిరియాల పొడి కలిపి నొప్పి ఉన్న పన్ను మీద పెట్టాలి.
*ఒక్క చిటికెడు ఉప్పు కలిపిన ఆవ నూనెను సలుపుతున్న చిగుళ్ళపై మర్దన చెయ్యాలి.
*నిమ్మరసం కూడా పంటి నొప్పిని తగ్గిస్తుంది.
* పుదీనా కూడా పంటి నొప్పిని తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.


*నొప్పిగా ఉన్న చిగుళ్ళ మీద మరియు పంటి మీద అప్పుడే తరిగిన ఉల్లి పాయ ముక్కను పెట్టుకోవడం ద్వారా పంటి నొప్పిని సమర్ధవంతంగా నివారించవచ్చు.
*పంటి నొప్పిని తగ్గించే కాలెండ్యులా (కాలెండ్యులా అఫిసినాలిస్ ), మిర్ (కొమ్మిఫోరా మిర్రా) మరియు సేజ్ (సాల్వియా అఫిసినాలిస్ ) వంటి మూలికలతో పుక్కిలించడానికి ఇంట్లొనే మౌత్ వాష్ ను తయారు చేసుకోవచ్చు. తులసి, మర్జోరం మరియు మెంతి కూడా ఇందుకు పనికి వస్తాయి.
*లవంగాలు కూడా పంటి నొప్పికి మంచి చిట్కాగా ఉపయోగపడతాయి. నొప్పి ఉన్న పంటిపై లవంగాన్ని పెట్టి నెమ్మదిగా నొక్కాలి దీంతో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
*నొప్పిని అదుపులో ఉంచడానికి బుగ్గ మీద ఐస్ క్యూబ్స్ ఉపయోగించవచ్చు.


*అకస్మాత్తుగా పంటి నొప్పి మొదలైనప్పుడు, చల్లటి, వేడి మరియు తీపి పదార్ధాలు నొప్పిని అధికం చేస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.
*ఆహార విషయంలో జాగ్రత్త వహించాలి. కూరగాయలు, పళ్ళు, ధాన్యాలు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి.
*కొన్నిసార్లు దంతాల్లో పేర్కొన్న వ్యర్థాల కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్‌ ద్వారా కూడా పంటి నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గోరు వెచ్చటి నీటిలో కాస్త ఉప్పు వేసి నోట్లో వేసుకొని బాగా పుక్కిలించాలి. దీంతో దంతాల చుట్టూ, మధ్య పేరుకుపోయిన వ్యర్థాలు బయటకు పోతాయి. నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

Related posts