telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

వీటిని ప్రతిరోజు తినండి…ఏ డాక్టర్‌ అవసరం

ఖర్జూర పండ్లంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే, వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కరోనా కాలంలో రోగ నిరోధక శక్తి(ఇమ్యునిటీ) పెంచుకోవడం ఎంతో ముఖ్యం. మంచి ఆరోగ్యం, ఇమ్యునిటీ పెరగాలంటే.. మీరు తప్పకుండా ఖర్చూరాలను తీసుకోండి. ఈ పండు.. ఇన్ఫెక్షన్లను తట్టుకునే వ్యాధి నిరోధక శక్తిని అందిస్తుంది. విటమిన్ C, B 5, ఐరన్, ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు తదితర పోషకాలు ఖర్జూరాల్లో ఉన్నాయి. చర్మం, మెదడు, ఎముకలు, జుట్టు ఆరోగ్యానికి ఖర్జూరాలు చాలా మంచివి. పలు ఔషదాల్లో కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. ఖర్జూరాలతో మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి అందుతాయి. అవేంటో చూసేద్దామా మరి.
✺ ఖర్జూరం శరీరంలోని కొవ్వును తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది.
✺ రక్తపోటు సమస్య ఉండదు.
✺ ఎముకలలో పటుత్వాన్ని పెంచుతుంది.
✺ ఉదర సంబంధ వ్యాధులను ఈ పండ్లు అరికడతాయి.
✺ గర్భిణీలకు ఖర్జూరం చాలా మంచిది.
✺ గర్భిణీలు ప్రసవానికి ముందు నాలుగు వారాలు రోజుకు 4 ఖర్జూరాల చొప్పున తింటే ప్రసవం సులువుగా అవుతుంది.
✺ ఖర్జురాలు తింటే కంటి చూపు మెరుగవుతుంది.
✺ వేసవిలో ఖర్జూరాలను నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగితే వడదెబ్బ తగలదు.
✺ ఖర్చూరాల్లోని టానిన్ పెద్ద పేగు సమస్యలను పరిష్కరిస్తుంది.
✺ ఖర్జూరాల గుజ్జుతో జలుబు, శ్లేష్మం, గొంతునొప్పి త్వరగా తగ్గిపోతాయి.

Related posts