telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

జుట్టుకు గోరింటాకు వాడుతున్నారా…అయితే ఈ సంచలన నిజాలు తెలుసుకోండి

ఎన్నో తరాలనుంచి గోరింటాకు మన జుట్టు అందానికి ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు, ఐతే గోరింటాకు జుట్టుకే కాకుండా, సందర్బాన్నిబట్టి స్త్రీలు వాళ్ళ చేతులు, కాళ్ళకు కూడా ఉపయోగిస్తూఉంటారు. పొడవైన, మృదువైన, మరియు అందమైన జుట్టుని పొందడానికి గోరింటాకు ఎంతో ఉపయోగపడుతుంది.
అందరికీ తెలిసినది గోరింటాకు జుట్టు కండీషనర్ గా ఎంతగానో ఉపయోగపడుతుంది అని, కాని ఇది మన జుట్టు నిర్మాణాన్ని పాడుచేస్తుంది అని ఒక తప్పుడి ప్రచారం ఉంది.అసలు నిజం ఏమిటంటే మర్కెట్లో దొరుకేవి అన్నీ ఎంతో ప్రమాదకరమైనవి అందుకే అవి మీ జుట్టుకి ఎంతో హానిని చేకూర్చి జుట్టు నిర్మాణాన్ని పాడుచేస్తాయి.
సహజమైన గోరింటాకులు మీకు అందమైన జుట్టుని ఇవ్వడంలో ఎంతో సహయపడతాయి, అంతేకాకుండా దీనితో టీ ఆకులు, పెరుగు, అండాలు, నిమ్మరసం, మరియు ఉసిరికాయ రసం వంటి ఇతర పదార్ధాలను కలిపి ఉపయోగిస్తే మంచి సత్ఫలితాలు పొందవచ్చు. జుట్టుకి సంబందించినంతవరకు గోరింటాకు మంచి “హెయిర్ కలరింగ్ ఏజెంట్” గానే కాకుండా ఒక మంచి “హెయిర్ కండీషనర్” గా కూడా ఉపయోగ పడుతుంది.
గోరింటాకుని జుట్టుపై ఉపయోగించుకోవడం ఎలా??
కావాల్సినవి:
మెహంది పొడి – 2 cups ,
గుడ్లు – 2 లేదా 3
కాఫీ పొడి – 2 టేబుల్ స్పూన్లు
టీ ఆకులు – 4 టేబుల్ స్పూన్లు
కత్త పొడి -1 టేబుల్ స్పూన్
పంచదార 1 / 2 టేబుల్ స్పూన్
పద్దతి 1:
ఒక గిన్నెలో 2 గ్లాసులు నీరు తీసుకొండి,టీ ఆకులు, కాఫీ పొడి కలిపి 5 నిమిషాలు వేడి చేయండి.మరొక గిన్నెలో గోరింటాకు మరియు ఇతర పదార్దాలు తీసుకుని అన్నీ కలిపి 2-3 గంటలు తరువాత మీ జుట్టూకి పట్టించండి. 1 గంట తరువాత గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయండి.
పద్దతి2:
మీ జుట్టుని తడిగా చేసి, గోరింటాకు పేస్ట్ ని మీ జుట్టు మూలాలు నుంచి చివరివరకు రాసి, మీ జుట్టుని కవరుతో చుట్టేయాలి.
ఒక 1-4 మంటలు తరువాత తలస్నానం చేసి బాగా ఆరబెట్టాలి, తరువాత నూనె రాసి మరుసటి రోజు చూస్తే మంచి ఫలితం లబిస్తుంది.
ఆరోగ్యవంతమైన జుట్టు కోసం మరికొన్ని చిట్కాలు తెలుసుకుందామా:
ఒకవేళ మీరు గోరింటాకుని మొదటిసారిగా ఉపయోగిస్తుంటే రోజూ 4-5 పాటు తలకు పట్టించి, ఇలానే 4-5 రోజులు నుంచి కొన్ని వారాల పాటు చేస్తే మంచి ఫలితాల్ని ఇస్తుంది.
ఒకవేళ మీ జుట్టు గిరజాల మరియు ఉంగరాల మాదిరిగా మెలికెలు తిరిగి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే, ఈ గోరింటాకుని కోడి గుడ్డ్లు,పెరుగు కలిపి పట్టిస్తే గిరజాలు, ఉంగరాలు పొయి ఎంతో మృదువుగా అవుతుంది.
గోరింటాకు చాలా చల్లదనాన్ని ఇచ్చేది,అందువల్ల జలుబు, దగ్గు,జ్వరము, ఉన్నప్పుడు దానిని ఉపయోగించరాదు.
చుండ్రు సమస్యను గోరింటాకు ద్వారా పరిష్కరించవచ్చు. ఎటువంటి దుష్ప్రబావాలు లేకుండా మంచి ఫలితాల్ని ఇచ్చేది.
జుట్టుకి బలాన్ని అందించే పొషక పదార్దాలను ఇచ్చి ఎంతో అందంగా, మృదువుగా,మెరిసేలా చేస్తుంది.అంతేకాకుండా తలనొప్పి మరియు నిద్రలేమిని నయం చేస్తుంది.
ఒకవేళ మీరు శాఖాహారులు అయితే గుడ్డు బదులు పెరుగును ఉపయోగిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.
ఒకవేళ మీరు గోరింటాకుని “హెయిర్ కలర్ ఏజంట్”గా కాకుండ హెయిర్ కండీషనర్ గా మత్రమే ఉపయోగించుకోవాలంటే మీ జుట్టుకి నూనె రాసుకుని గోరింటాకు రాసుకుంటే మంచి ఫలితాలని ఇస్తుంది.
గోరింటాకు రాసుకున్న తర్వాత అది తడిగా ఉంచడానికి కవర్ చేయాలి, లేదంటే పొడిగా మరిపొయి గట్టిగా అయిపొయి,శుబ్రపరుచుకోవడానికి వీలు లేకుండా ఉంటుంది,అంతే కాకుండ అనుకున్న ఫలితాలు పొందలేరు.
గోరింటాకుని మీ జుట్టు పై ఎక్కువ సేపు ఉంచడం వల్ల పాడైపోయిన జుట్టును బాగు చేసి, అందమైన జుట్టుగా మారుస్తుంది.

Related posts