కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మరోసారి వ్యతిరేకించారు. ఈ బిల్లులు రైతులకు నష్టం చేకూర్చేలా ఉన్నాయని విమర్శించారు. బీజేపీయేతర పార్టీలు ఆ మూడు బిల్లులను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో పెట్టిన మూడు వ్యవసాయ బిల్లులు చట్టాలుగా మారితే పెద్ద కంపెనీలు లబ్ధి చెందుతాయని అన్నారు. ఆ కంపెనీల చేతిలో రైతులు మోసపోతారని కేజ్రివాల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. బీజేపీయేతర పార్టీలన్నీ ఏకగ్రీవంగా ఆ బిల్లులను రాజ్యసభలో వ్యతిరేకించాలని కోరారు.