కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత సుజనా చౌదరి సీబీఐ విచారణకు హాజరయ్యే నిమిత్తం బెంగళూరుకు చేరుకున్నారు. ఆయనతో పాటు బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఎండీ కల్యాణ్ శ్రీనివాస్, మరో ముగ్గురు డైరెక్టర్లనూ సీబీఐ విచారించనుంది. 2017లో ఆంధ్రాబ్యాంకును మోసం చేశారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసిన సీబీఐ, విచారణ జరిపి ప్రాధమిక ఆధారాలు ఉన్నాయని నిర్ధారించుకుంది.
ఆంధ్రాబ్యాంకుతో పాటు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కూడా రుణాలు పొంది, వాటిని తిరిగి చెల్లించలేదన్న ఆరోపణలు వచ్చాయి. కొన్ని షెల్ కంపెనీలను ఏర్పాటు చేసిన సుజనా గ్రూప్ మొత్తం రూ. 346 కోట్లను రుణంగా పొందినట్టు సీబీఐ గుర్తించింది. ఈ కేసులోనే విచారణకు హాజరు కావాలని సుజనాకు నోటీసులు అందాయి.
ప్రాజెక్టు నిర్మాణాలను తప్పుబట్టిన కోదండరాం