telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-3 : ఇంటినుంచి అలీ రెజా అవుట్… ట్విస్ట్ కు షాక్ లో ప్రేక్షకులు

Ali-Reza

బుల్లితెరపై టాప్ రియాలిటీ షో గా బిగ్ బాస్ తెలుగు దూసుకుపోతుంది. ఇప్పటికే ఇంటి నుండి ఐదుగురు కంటెస్టెంట్స్ బయటకి వెళ్లిపోయారు. ఇక ఈ వారం ఐదుగురు హౌస్ మేట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. గతవారం బిగ్ బాస్ లో ఎలిమినేషన్ ప్రక్రియ జరగలేదు. దీనితో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూశారు. బిగ్ బాస్ కార్య‌క్ర‌మంలో దాదాపు ఊహించ‌ని సంఘ‌ట‌నలే ఎక్కువగా జ‌రుగుతుంటాయి. కంటెస్టెంట్స్ ఎవ‌రు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవ‌రు ఇస్తారు, ఎలిమినేట్ ఎవ‌రు అవుతారు అనే విష‌యాలు చాలా సీక్రెట్‌గానే ఉంటాయి. ఎవరూ ఊహించని విధంగా ఈ వారం అలీ రెజా ఎలిమినేట్ అయ్యాడు. అలీ ఎలిమినేట్ కావడం అనేది ప్రేక్షకులకే కాదు హౌజ్ మేట్స్ కు కూడా షాకే… ఏడువారాల బిగ్ బాస్ కార్య‌క్ర‌మంలో తొలిసారి నామినేష‌న్‌లోకి వచ్చాడు. అంతేకాదు అలీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కూడా… టాప్ 3 లో ఉండాల్సిన అలీ ఇలా ఎలిమినేట్ కావడం పై నెటిజన్లు మండిపడుతున్నారు. గ‌డ‌చిన ఆరువారాల‌లో ఐదు ఎలిమినేషన్స్‌ జరిగాయి. దీంట్లో భాగంగా హేమ, జాఫర్‌, తమన్నా, రోహిణి, అషూ ఇంటిని వీడిపోయారు. ఇక ఈవారం అలీ ఇంటిని వీడారు. అందుకు కార‌ణం ఆయ‌నకున్న ఆవేశ‌మ‌నే చెబుతున్నారు. ప్ర‌తీసారి ఎక్కువ‌గా ఆవేశ‌ప‌డ‌డం, టెంప‌ర్‌తో నోటికొచ్చిన‌ట్టు మాట్లాడ‌డం ఆయ‌న‌కి త‌క్కువ ఓట్లు ప‌డేలా చేసింద‌ని అంటున్నారు.

Related posts