కలియుగ వైకుంఠ వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి నెలకి సంబంధించిన దర్శనం సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లను విడుదల చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 28వ తేదీన ఉదయం 9 గంటలకు రోజుకు 12 వేల చొప్పున టికెట్లు జారీ చేయనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇఆ మరుసటి రోజు అంటే జవనరి 29వ తేదీన రోజుకు 10 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఇక, తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటుగా, విదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. అయితే కరోనా నేథ్యంలో టీటీడీ.. శ్రీవారి దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తున్నారు. అంతేకాకుండా పరిమిత సంఖ్యలో మాత్రమే టికెట్లను విడుదల చేస్తుంది. కాగా, టీటీడీ విడుదల చేసిన కొద్ది నిమిషాల్లోనే హాట్ కేకుల్లా శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందే. దర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ రెండు డోసుల వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదా 48 గంటల ముందు చేసుకున్న కోవిడ్ టెస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరిగా అధికారులకు చూపించాలి. కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికెట్‌ను ఉన్నవారిని మాత్రమే అలిపిరి చెక్ పాయింట్ నుంచి తిరుమలకు అనుమతిస్తున్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో భక్తులు ఇందుకు సహకరించాలని టీటీడీ. కోరుతున్నారు.
టీడీపీ అధికారంలోకి వస్తే హైద్రాబాద్ కంటే అభివృద్ధి: నటి దివ్యవాణి