ప్రతి ఏడాది రీయూనియన్ పేరుతో 1980ల నాటి తారలంతా ఒకేచోట చేరి సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసంలో నిర్వహించిన రీయూనియన్ మీట్‌లో 1980-90ల నాటి దక్షిణాది తారలంతా పాల్గొన్నారు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, కన్నడ చిత్రపరిశ్రమల నుంచి 40 మంది సినీ తారలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, మోహన్ లాల్, భానుచందర్, జగపతిబాబు, నరేశ్, సురేశ్, సుమన్, భాగ్యరాజ్, రెహమాన్, ప్రభు, జాకీష్రాప్, జయసుధ, జయప్రద, నదియా, అమల, శోభన, సుహాసిని, రేవతి, సుమలత, రాధ, లిజి, పూర్ణిమ కలిసి దిగిన గ్రూప్ ఫొటో దిగారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేశాయి. అయితే ఈ కార్యక్రమానిక ఆహ్వానం అందకపోవడంపై వెటరన్ నటుడు, డైరెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. “నేను మంచి నటుడు, దర్శకుడిని కాకపోవడం వలననే నాకు ఆహ్వానం అందలేదనకుంటా. ఏమి చెప్పగలను… దీనిని బట్టి చూస్తుంటే నేను చేసిన సినిమాలకి ఏ మాత్రం వ్యాల్యూ లేదనిపిస్తుంది… కొంతమంది మిమ్మల్ని ఇష్టపడవచ్చు, కొందరు మిమ్మల్ని ద్వేషిస్తారు … కానీ జీవితం మాత్రం కొనసాగుతుంది” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.