telugu navyamedia
క్రీడలు వార్తలు

టెస్టు సిరీస్‌‌ను కంగారూలు సులువుగా గెలుచుకుంటారు…

smith first and kohli second in test rankings

ఐపీఎల్ 2020 ముగిసిన వెంటనే భారత జట్టు ఆస్ట్రేలియా టూర్‌కు సిద్ధమైంది. ఈనెల 27న జరగనున్న ఆసీస్‌తో టూర్ నేపథ్యంలో ఇవాళ బయలుదేరనుంది టీమిండియా. కంగారూ గడ్డపై భారత్‌ మొదటగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఆ తర్వాత డిసెంబర్‌ 17 నుంచి నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆసీస్‌, ఇండియా తలపడనున్నాయి. ఈ టూర్‌‌లో టెస్టు సిరీస్ గురించి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ స్పందించాడు. తొలి టెస్టు మినహా మిగతా మూడు మ్యాచులకు దూరమవనున్న కోహ్లీ గైర్హాజరీలో టీమిండియా గెలుపోటములపై వాన్ పలు వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాతో మూడు టెస్టులకు కోహ్లీ దూరం కానున్నాడు. పుట్టబోయే బిడ్డను చూడటానికి వెళ్లాలనుకోవడం సరైన నిర్ణయంగా తెలిపాడు. కోహ్లీ లేకపోవడం టీమిండియాకు మైనస్ అవుతుందని, టెస్టు సిరీస్‌‌ను కంగారూలు సులువుగా చేజిక్కించుకుంటారని వాన్ జోస్యం పలికాడు. అయితే గత ఏడాది సిరీస్ లో స్మిత్, వార్నర్ లేని సమయంలో భారత్ ఆసీస్ గడ్డపైన టెస్ట్ సిరీస్ ను గెలిచింది. ఇప్పుడు కోహ్లీ లేని సమయంలో కంగారూలు తమ గడ్డ పైన భారత్ ను సులువుగా ఓడిస్తారు అని తెలిపాడు. అయితే వచ్చే నెల 17 న ప్రారంభం కానున్న ఈ టెస్ట్ సిరీస్ ఎవరి విజయం సాధిస్తారు అనేది చూడాలి.

Related posts