telugu navyamedia
సినిమా వార్తలు

“ఆర్ఆర్ఆర్” వాయిదా… రామ్ చరణ్ కు గాయం

Ram Charan images

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల క్రేజీ మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్” నిర్మితమవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా,  ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ సరసన అలియా భట్, ఎన్టీఆర్ కు జతగా డైసీ ఎడ్గార్ అనే విదేశీ నటి నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, సంజయ్ దత్, వరుణ్ ధావన్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. ప్రస్తుతం ఈ క్రేజీ మల్టీస్టారర్ మూవీ షూటింగ్ గుజరాత్‌లోని వడోదరాలో జరుగుతోంది. అయితే ఈ షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడిందని సమాచారం. ఆర్‌ఆర్ఆర్ బృందం తమ ట్విట్టర్ ఖాతా ద్వారా ‘‘నిన్న జిమ్‌లో కసరత్తు చేస్తుండగా.. రామ్‌చరణ్ మడిమ భాగంలో స్వల్పగాయమైనట్లు తెలుపుటకు చింతిస్తున్నాము. దీనితో పూణె షెడ్యూల్‌ని రద్దు చేశాము. మూడు వారాల తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభిస్తాము’’ అంటూ చిత్రం వాయిదాకు గల కారణాన్ని వెల్లడించింది. దీంతో రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related posts