telugu navyamedia
సినిమా వార్తలు

“సర్కారు వారి పాట” సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్ …

సూపర్​స్టార్ మహేశ్​బాబు హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘సర్కారు వారి పాట. దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి పోస్టర్ ఈ మూవీ మరింత హైప్ క్రియేట్ చేశాయి.

Sarkaru vaari paata kalaavathi song music video mahesh babu keerthy suresh  | Galatta

ముఖ్యంగా రీసెంట్ గా వచ్చిన మొదటి సింగిల్ “కళావతి” సాంగ్‌ యూట్యూబ్ లో రికార్డులన్నీ బ్రేక్ చేస్తుంది. ఇక ఈ చిత్రం రెండవ సింగిల్ ‘పెన్నీ’ ప్రోమోను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ ప్రోమోలో మహేష్ బాబు సూపర్ స్టైలిష్ గా కన్పించగా, మరో సర్పైజ్ ఇచ్చారు మేకర్స్.

Tollywood : Sarkaru Vaari Paata second single promo released

‘ఎవ్రీ ఎవ్రీ పెన్ని..’ అంటూ సాగే ఈ పాటలో మహేష్ బాబు ముద్దుల తనయ సితార  స్టైలిష్‌ స్టెప్పులతో మహేష్ అభిమానులను ఫిదా చేస్తున్నాయి.

తండ్రి ఓ ఫారిన్‌ లేడి గ్రూప్‌తో డ్యాన్స్‌ చేస్తుంటే.. సితార మరో గ్రూప్‌తో లీడ్‌ డ్యాన్స్‌ర్‌గా ఆకట్టుకుంటుంది. ఇలా తండ్రి కూతుళ్లను ఒకే పాటలో చూసి సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ మురిసిపోతున్నారు. మొదటి సారి సితార బిగ్ స్క్రీన్ పై కనిపించనుంది.

Sarkaru Vaari Paata: Mahesh Babu, Keerthy's track Kalaavathi is a soulful  melody by Thaman-Sid Sriram | PINKVILLA

ఇక  పూర్తి పాటను మార్చి 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దాంతో పాటే సూపర్​ స్టైలిష్​గా ఉన్న మహేశ్​ ఫొటోను షేర్ చేసింది. ఈ చిత్రంలో మహేశ్​బాబు.. బ్యాంకు అధికారిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం మే 12న విడుద‌ల కానుంది.

Related posts