తమిళ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. రజినీకాంత్, కమల్ హసన్ కలిసి నటించనున్నారు. కమల్ ఓన్ బ్యానర్ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై ఓ భారీ సినిమా తెరకెక్కనుంది. కార్తీ ‘ఖైదీ’ సినిమాతో మంచి హిట్ కొట్టిన దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. దీనిపైన దర్శకుడు లోకేశ్ కనకరాజ్ మాట్లాడుతూ.. రజనీ, కమల్ ఇద్దరూ నటించే చిత్రంపై చర్చలు జరుగుతున్నాయని, అంతా సవ్యంగా జరగితే అద్భుతం జరిగినట్టేనని ఆయన చెప్పారు. త్వరలోనే వివరాలని వెల్లడిస్తామని అన్నారు. ఈ ప్రకటనతో రజినీ, కమల్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సినీ అభిమానులు కూడా సంతోషంలో మునిగిపోయారు.. `ఈ సినిమాని తమిళ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకూ రజినీకాంత్, కమల్ హసన్ కలిసి మొత్తం పది సినిమాల్లో నటించారు. దాదాపుగా 35 ఏళ్ల తర్వాత మళ్ళీ కలిసి నటిస్తున్నారు. దాదాపుగా ఇద్దరి సినీ కెరీర్ ఒకేసారి మొదలైంది.. ఇద్దరు తమదైన నటనతో ఆకట్టుకొని చాలా మంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నారు.
previous post
next post