telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మరో గ్రామానికి సోనూసూద్ సాయం…

sonu-sood

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ లో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఎంతో మందికి సహాయం చేసి దేవుడు అయ్యాడు. ఆ కష్ట కాలంలో సోనూ సూద్ చేసిని సహాయం మరువలేనిది. ఎందరో వలస కార్మికులను ఇల్లకు చేర్చారు. విదేశాలలో చిక్కుపోయిన వారిని స్వదేశానికి రప్పించారు. ఇలా లాక్‌డౌన్ సమయంలో మొదలు పెట్టిన సహాయాన్ని సోనూసూర్ కొనసాగిస్తూనే ఉన్నారు. సహాయం కోరుతు తన వద్దకు చేరిన వారికి లేదనకుండా చేయూతనిస్తున్నారు. అయితే తాజాగా సోనూ సూద్ ఓ గ్రామాన్ని కాపాడారు. అది కూడా ఓ కోతి బారినుంచి. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఓ నెటిజన్ తమ గ్రామం అంతా కూడా ఓ కోతి కారణంగా పడుతున్న ఇబ్బంది పడుతుందని, ఇప్పటి వరకు కోతి కారణంగా దాదాపు 25మంది గాయాల పాలయ్యారని ట్వీటర్ ద్వారా సోనూకు చేరవేశాడు. విషయం తెలుసుకున్న సోనూ వెంటనే స్పందించారు. కోతిని పట్టించి అడవుల్లో విడిచిపెట్టించారు. ఈ విధంగా గ్రామాన్ని కాపాడి మరో సారి తన దాత్రుత్వాన్ని చాటారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దంతో ప్రజలు అందరూ సోనూ సూద్ ను ప్రశంసిస్తున్నారు.

Related posts