telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

భారత ఆటగాళ్ళకి వసీం జాఫర్ సూచనలు…

డబ్ల్యూటీసీ ఫైనల్ ముందు భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లకి మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఓ సలహా ఇచ్చారు. అయితే అది కోడ్ లాంగ్వేజ్‌లో ఉండడం విశేషం. జాఫర్ ఇలా కోడ్ లాంగ్వేజ్‌లో భారత జట్టుకు సూచనలు ఇవ్వడం ఇదేం తొలిసారి మాత్రం కాదు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత బ్యాట్స్‌మెన్‌లు ఎలా ఆడాలి అనేదానిపై వసీం జాఫర్ తాజాగా తన యూట్యూబ్ వీడియోలో పేర్కొన్నారు. మాజీ ఓపెనర్ జాఫర్ మాట్లాడుతూ… ‘భారత్ జట్టుతో కలిసి నేను రెండు సార్లు ఇంగ్లండ్ పర్యటనకి వెళ్లాను. టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌కి నేను కోడ్ రూపంలో చెప్పేది ఒక్కటే. బాలీవుడ్ పాత సినిమాల్లో పోలీసులు సాధారణంగా చేసే పనినే ఫైనల్లో చేయండి’ అని సూచించారు. సోషల్ మీడియాలో జాఫర్‌ ఎపుడూ యాక్టీవ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. టీమిండియా తరపున 31 టెస్టులు, 2 వన్డేలు ఆడారు.

Related posts