డైలాగ్ కింగ్ సాయి కుమార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆది మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్నాడు. ప్రేమ కావాలి, తర్వాత లవ్లీ, సుకుమారుడు వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకలకు దగ్గరైయ్యాడు. అయితే ఇటీవలికాలంలో ఆదికి సరైన సక్సెస్‌లు లేవు. ఆ మధ్యకాలంలో వచ్చిన ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ రీసెంట్‌గా వచ్చిన ‘శశి’ రెండు సినిమాలతో బాగానే ఆకట్టుకున్నాడు.
ఆది తాజాగా నటిస్తున్న చిత్రం ‘అతిథి దేవోభవ’. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ కాస్త డిఫరెంట్‌గా ఉంది. .ఒక అద్దంలో హీరో హీరోయిన్ మరి దాని బయట నుంచి దానిలోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నట్టుగా ఆది కనిపిస్తున్నాడు.
యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు పొలిమేర నాగేశ్వర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రామ సత్యన్నారాయణ రెడ్డి సమర్పిస్తున్నారు. ఆది సరసన నువేక్ష హీరోయిన్ గా నటిస్తుంది. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు..
‘అతిథి దేవోభవ’ ఫస్ట్‌లుక్ పోస్టర్ మంచి అంచనాలనే పెంచుతోంది. చూడాలి మరి దీనితో ఈ యంగ్ హీరో ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో…