తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఐఏఎస్ అధికారులను కేంద్ర సర్వీసులోకి బదిలీ చేశారు. జీహెచ్‌ఎంసీలో విధులు నిర్వహిస్తున్న ఆమ్రపాలి, కె.శశికిరణాచారి ఇద్దరు ఐఏఎస్ అధికారులను కేంద్ర సర్వీసులోకి బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. వారిని కేంద్ర సర్వీసుల్లోకి పంపాలని కేంద్ర హోమ్ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు అందాయి.
కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిగా ఉన్న జి.కిషన్ రెడ్డి కార్యాలయంలో ఓఎస్డీగా (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) ఆమ్రపాలి, అదనపు వ్యక్తిగత కార్యదర్శిగా కె.శశికిరణాచారి విధుల్లో చేరనున్నారు. గతంలో వరంగల్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన ఆమ్రపాలి, ఆపై జీహెచ్‌ఎంసీకి బదిలీ అయి, అడిషనల్ కమిషనర్ గా కొనసాగుతున్నారు.
సోము వీర్రాజు కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు…