telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఈ పోరాటంలో యువత ముందు వరుసలో ఉంది: మోదీ

modi speech on J & K

కరోనాపై పోరాటం కోసం ప్రధాన్‌ మంత్రి సిటిజన్స్‌ అసిస్టెన్స్‌ అండ్‌ రిలీఫ్‌ ఇన్‌ ఎమర్జెన్సీ సిచుయేషన్‌(పీఎం కేర్స్‌) నిధి ని కేంద్ర ప్రభుత్వం శనివారం ఏర్పాటు చేసింది. దీనికి విరివిగా విరాళాలు ఇవ్వాలని దేశ ప్రజలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. ఆరోగ్యవంతమైన భారత్‌కు ఇది దోహదపుడుతుందన్నారు. ప్రజలు www.pmindia.gov.in సైట్‌లో విరాళాలు చెల్లించాలన్నారు.

ప్రధాని మోదీ పిలుపు మేరకు కావ్య, చైతన్య అనే ఇద్దరు పీఎం కేర్స్‌ను తమ సేవింగ్స్‌ మొత్తం పంపించారు. కావ్య రూ.19,090, చైతన్య రూ.13,378 ను పంపించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇరువురి తండ్రి.. పీఎంకు ట్విట్‌ చేశారు. దీనిపై స్పందించిన ప్రధాని ఇరువురిని ప్రశంసించారు. కోవిడ్‌-19పై పోరాటంలో దేశ యువత ముందు వరుసలో ఉందని కొనియాడారు.

Related posts