డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియలో పలు మార్పులు చేసింది కేంద్రం.. ఈ కొత్త నిబంధనలు జులై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ పేర్కొంది.. ఇవాళ విడుదల చేసిన కొత్త రూల్స్ ప్రకారం.. దేశ వ్యాప్తంగా ఉన్న గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణా కేంద్రాల నుంచి డ్రైవింగ్ లైసెన్సులు పొందే వీలుంటుంది. కాగా, ప్రస్తుతం ప్రభుత్వ ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో మొదట కంప్యూటర్ టెస్ట్.. ఆ తర్వాత అధికారుల ఎదుట డ్రైవింగ్ ట్రయల్ రన్ నిర్వహిస్తే.. మొదట లెర్నింగ్, ఆ తర్వాత పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేస్తున్నారు.. అయితే, ఈ ప్రక్రియలో డ్రైవర్ల డ్రైవింగ్ నైపుణ్యతలు తేల్చడం కాస్తా ఇబ్బందికరంగా ఉందని నిర్ధారణకు వచ్చిన కేంద్రం.. కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూళ్లలో ఉత్తీర్ణత సాధించిన వ్యక్తులకు వారు డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసే సమయంలో డ్రైవింగ్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. అయితే, డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలలో సిమ్యులేటర్లతో పాటు ప్రత్యేక డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ఉండాల్సిందే.. మోటారు వాహనాల చట్టం, 1988 ప్రకారం అవసరాలకు అనుగుణంగా ఇటువంటి కేంద్రాలు రిమైడల్, రిఫ్రెషర్ కోర్సులను పొందే అవకాశాన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
previous post
next post