telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనా వైరస్‌ భయభ్రాంతులకు గురిచేస్తుంది: మంత్రి ఈటల

Etala Rajender

కరోనా వైరస్‌ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుందని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్కరికి కూడా కరోనా వైరస్‌ నిర్ధారణ కాలేదని తెలిపారు. ఈ వైరస్‌ ప్రపంచంలో 26 దేశాలకు వ్యాపించిందన్నారు. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

నగంరలోని గాంధీ, ఫీవర్‌, ఛాతీ ఆస్పత్రుల్లో ఐసోలేటెడ్‌ వార్డులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గాంధీ ఆస్పత్రిలోనే కరోనా వైరస్‌ రక్తనమూనాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 6 నుంచి 7 గంటల వ్యవధిలో పరీక్షల నివదికలు ఇస్తున్నామన్నారు. చైనా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 125 మందిని పర్యవేక్షణలో ఉంచినట్లు మంత్రి చెప్పారు. 60 నుంచి 70 మంది నమూనాల పరీక్షల నివేదికలు వచ్చినట్లు వీరెవరికి కరోనా వైరస్‌ నిర్ధారణ కాలేదన్నారు.

Related posts