telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

“చందమామ”

గగనంలో చందమామ
కనుల ముందు మేనమామ
కనిపించేనా వెన్నెలమ్మ
కవిలా వర్ణించెనమ్మ
కవితై ఒదిగెనమ్మా
అలలా సాగెనమ్మ
ఆవిరై పోయెనమ్మ
ఆకశమే నీవమ్మ
అందనంత ఎత్తమ్మ
ఆగని పయనమమ్మ
అలసిపోయిన ప్రాణమమ్మ
………………………………..
మనసున మీ రూపం
మదిలోన మీ ఆలోచనలు
ఇలలోన మీరుంటే
కవ్వించదా మనసు
కలలోన సైతం కానరాదే
మీ దేహం
మీజ్ఞాపకమే నాలో ఓ పులకంత
కలత చెందిన మనసుకు ఊరట
ఎలా గడపను కాలాన్ని
కవితలతో కాలయాపన చేయనా
కాలగర్భంలో కలసిపోనా
ప్రియతమా చేరువై నాలో ఒదిగిపోవా
వర్ణించతరమా మనకలయిక
కలవరించదా నా మనసు ఇక
నీరాకకై ఎదురు చూడక
కాలం గడిచేది ఎలా ఇంక
ఇదే నా తలపు చాలిక నను చంపక!!!*

Related posts