నవ్యాంధ్ర నూతన గరవ్నర్‌గా ఒడిశా సీనియర్ బీజేపీ నేత బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు ఉదయం 11.35 గంటలకు విజయవాడలో సిద్ధం చేసిన రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలో జరిగిన ఈ కార్యక్రమంలో బిశ్వభూషణ్‌తో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు.
రాష్ట్ర విభజన అనంతరం ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఇన్నాళ్లు రెండు రాష్ట్రాల బాధ్యతలు చూసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఇటీవల బిశ్వభూషణ్ నియమితులయ్యారు. కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, విపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, సీజే, సీఎం జగన్ తేనీటి విందులో పాల్గొననున్నారు.
అందుకే వయనాడ్‌లో రాహుల్ గెలిచాడు: ఒవైసీ