telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆర్టీసీని నమ్ముకున్నారు: పవన్ కల్యాణ్

pawan

రాష్ట్రంలో దాదాపు 7,600 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆర్టీసీని నమ్ముకుని జీవిస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వారిలో భయాందోళనలను తొలగించడానికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. 13వ తేదీన ఆర్టీసీ ఎండీ కార్యాలయం నుంచి వచ్చిన ఒక ఉత్తర్వు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను భయాందోళనలోకి నెట్టేసిందని చెప్పారు. వీరి జీతాలు రూ. 6 వేల నుంచి రూ. 15 వేల మధ్య ఉంటాయని తెలిపారు.

లాక్ డౌన్ సమయంలో జీతాలు చెల్లించకపోతే వారంతా ఎలా బతుకుతారని పవన్ ప్రశ్నించారు. ప్రస్తుత కష్ట కాలంలో ఉద్యోగాలను తొలగించవద్దని కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పిందని తెలిపారు. ప్రస్తుత కరోనా సమయంలో ఇన్స్యూరెన్స్ లేనందునే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోలేదని మంత్రి చెప్పడంసరికాదని అన్నారు. ఈ కరోనా ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదని, అప్పటి వరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లోకి పిలవరా? అని మండిపడ్డారు.

Related posts