telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కోలుకున్న బ్రిటన్‌ ప్రధాని..ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌

Britan pm Boris jonnson

కరోనా వైరస్ సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ డిశ్చార్జ్‌ అయ్యారు. గత ఆదివారం నుంచి ఆయన సెయింట్ థామస్ హాస్పిటల్‌లో ఐసీయూలో కరోనాకు చికిత్స తీసుకున్నారు. కొద్దిరోజుల పాటు బోరిస్‌ బకింగ్‌హామ్‌షైర్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటారని డౌనింగ్‌ స్ట్రీట్‌ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. వైరస్ లక్షణాలు తీవ్రంగా ఉండటంతో ఏప్రిల్‌ 5న ఆయన హాస్పిటల్‌కు వెళ్లారు. దాదాపు మూడు రోజుల పాటు ఆయనకు ఐసీయూలోనే ఆక్సిజన్ అందించారు.

బోరిస్‌ పరిస్థితి మెరుగుపడటంతో జాన్సన్‌ను ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మార్చారు. సెయింట్ థామస్ ఆస్పత్రిలో తనకు వైద్య సేవలు అందించిన నేషనల్‌ హెల్త్ స్టాఫ్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని బోరీస్‌ పేర్కొన్నారు. ఇక యూకేలో ఇప్పటివరకు 78 వేలకు పైగా కరోనా కేసులు 9 వేలకు పైగా మరణాలు సంభవించాయి.

Related posts