telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

భోగి రమ్మంటుంది.. బోగి వద్దంటుంది.!

trains heavy passangers

సంక్రాంతి పండగకు స్వస్థలాలకు వెళ్ళేందుకు రైళ్లలో, బస్సుల్లో ప్రయాణీకుల రద్దీ విపరీతంగా పెరిగింది. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చినప్పటికీ అవి ప్రయాణీకులకు సరిపోవడం లేదు. రైల్వేస్టేషన్‌ లు ప్రయాణీకులతో కిక్కిరిసి పోతున్నాయి. హైదరాబాద్ నగరం నుంచి లక్షల మంది సొంతూళ్లకు వెళ్లే వారితో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పరిస్థితి దారుణంగా ఉంది. ప్లాటుఫామ్ పై భారీ సంఖ్యలో ప్రయాణీకులు పోటెత్తడంతో రైల్ ఎక్కడానికి ప్రయాణీకులు నానా తంటాలు పడవలిసి వస్తుంది. గత రెండు రోజులుగా రైల్ బోగి ఎక్కాలంటే ప్రయాణీకులు నానా తంటాలు పడుతున్నారు.

సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్‌ల నుంచి ప్రతి రోజు వందల సంఖ్యలో రైళ్లు, లక్షల్లో ప్రయాణికులు సొంత ఊళ్లకు తరలి వెళ్తున్నారు. అన్ని రైళ్లలోనూ చాలావరకు బుకింగ్‌లు నిలిచిపోయాయి. ప్రస్తుతం జనరల్‌ బోగీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రతి రోజు లక్షల్లో ప్రయాణికులు సొంత ఊళ్లకు తరలి వెళ్తున్నారు. దీంతో ఆయా రైల్వే స్టేషన్లు ప్రయాణీకులతోకిటకిటలాడుతున్నాయి.

మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, జూబ్లీబస్‌స్టేషన్‌లతో పాటు, కూకట్‌పల్లి, మియాపూర్, ఉప్పల్, ఎల్‌బీనగర్, సాగర్‌రింగురోడ్, తదితర ప్రధాన కూడళ్లు ప్రయాణికులతో పోటెత్తాయి. గత రెండు రోజులుగా భారీ సంఖ్యలో నగరవాసులు సొంత ఊళ్లకు తరలి వెళ్లారు. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది.

Related posts